హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ABN , Publish Date - May 04 , 2026 | 09:17 PM
తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హజ్ యాత్రికులకు అదనంగా అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, మే 04: తెలంగాణ ప్రభుత్వం హజ్ యాత్రికులకు గుడ్ న్యూస్ తెలిపింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో హజ్ యాత్ర ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ అదనపు భారాన్ని పేద ముస్లిం సోదరులపై పడకుండా, ఆ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘హజ్ యాత్రికులకు అదనంగా అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 7 వేల మంది హజ్ యాత్రికులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ముస్లిం యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ముస్లిం సోదరులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని హజ్ యాత్రికులు, మైనారిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం: పీవీఎన్ మాధవ్
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం చరిత్రాత్మకం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ