Share News

తెలంగాణలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:41 PM

రాష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 200 కోర్టులను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణలో 200 కొత్త కోర్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Telangana Government Approves 200 New Junior Civil Judge Courts

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు న్యాయ శాఖ కార్యదర్శి బీ. పాపిరెడ్డి ఆర్థిక శాఖ ఆమోదంతో జీవో ఎంఎస్ నంబర్ 59 (G.O.Ms.No.59)ను జారీ చేశారు.


రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు మొత్తం 594 కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం తొలిదశ కింద 200 కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.


అధిక కోర్టులు కేటాయించిన జిల్లాలు

రంగా రెడ్డి జిల్లా: గరిష్ఠంగా 30 కోర్టులు (రాజేంద్రనగర్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, హయత్‌నగర్, చేవెళ్ల, షాద్‌నగర్, ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నంలలో).

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: 25 కోర్టులు (మల్కాజిగిరి, ఉప్పల్, మేడ్చల్ ప్రాంతాల్లో).

హైదరాబాద్: సిటీ సివిల్, సెషన్స్ కోర్టుల పరిధిలో 16 కోర్టులు.

ఇతర జిల్లాలు: నల్గొండ (10), ఖమ్మం (8), సంగారెడ్డి (8), కరీంనగర్ (7), సూర్యాపేట (7), నిజామాబాద్ (6), జగిత్యాల (6), సిద్దిపేట (5), మంచిర్యాల (5), వరంగల్, హనుమకొండ కలిపి (12) కోర్టులు మంజూరయ్యాయి.

Telangana courts 1.jpg


Telangana courts 2.jpg


Telangana courts 3.jpg


ఈ వార్తలనూ చదవండి:

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ.. సీఈసీపై సుప్రీంకోర్టులో పిల్

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. రెండు వాహనాల ఢీ, ఆరుగురి మృతి

Updated Date - Sep 25 , 2026 | 09:46 PM