Share News

తెలంగాణ విద్యుత్ రంగంలో సరికొత్త మైలురాయి

ABN , Publish Date - Sep 26 , 2026 | 07:59 PM

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడానికి, రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ దిశగా తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది.

తెలంగాణ విద్యుత్ రంగంలో సరికొత్త మైలురాయి
Telangana GENCO Plans 140 Million Units Daily Power Generation at Yadadri Plant

హైదరాబాద్, సెప్టెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడానికి, రాష్ట్రాన్ని విద్యుత్ మిగులు దిశగా తీసుకెళ్లేందుకు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (TGGENCO) భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి (విద్యుత్ శాఖ మంత్రి) మల్లు భట్టి విక్రమార్కల స్పష్టమైన ఆదేశాల మేరకు దామరచర్ల వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ 140 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అవసరమైన కసరత్తు వేగవంతమైంది.


యాదాద్రి ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతో TGGENCO మొత్తం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 4,042.5 మెగావాట్ల (MW) నుంచి ఏకంగా 7,180 మెగావాట్లకు (MW) పెరగనుంది.


యాదాద్రి ప్లాంట్‌లో ఒక్కొక్కటి 800 MW సామర్థ్యం కలిగిన మొత్తం 5 యూనిట్లు (3,200 MW) నిర్మిస్తున్నారు. పర్యావరణ అనుమతులు, సాంకేతిక చిక్కుల కారణంగా నిలిచిపోయిన పనుల్లో 2024లో మళ్లీ కదలిక వచ్చింది. 2024లోనే ప్రాజెక్ట్ యూనిట్లను గ్రిడ్‌కు అనుసంధానించగా, 2025 జనవరిలో తొలి 800 MW యూనిట్‌ ద్వారా ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది.


రాబోయే ఆరు నెలల్లో మిగిలిన నిర్మాణ, సాంకేతిక పనులన్నింటినీ పూర్తి చేసి, ప్లాంట్‌ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడపాలని రేవంత్ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

కీవ్‌పై రష్యా డ్రోన్ దాడులు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు

కూలిన విమానం.. ఇద్దరు లెఫ్టినెంట్ జనరల్స్ సహా 14 మంది మృతి

Updated Date - Sep 26 , 2026 | 08:01 PM