మాదీ భరోసా!
ABN , Publish Date - Aug 01 , 2026 | 06:17 AM
తెలంగాణలో తాము నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ.. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ కన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లో మాత్రమే ఉందని, తాము భారత్ ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నామని తెలిపారు....
మీ పెట్టుబడులకు సురక్షితమైన గమ్యస్థానం తెలంగాణ
గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లోనే..
ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నాం
గత పాలకులు తీసుకొచ్చిన కొన్ని మంచి విధానాలను
కొనసాగిస్తూనే కొత్త విధానాలను అమలు చేస్తున్నాం
దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 10 శాతానికి చేర్చడమే లక్ష్యం
మాకు పోటీ పక్క రాష్ట్రాలతో కాదు.. విశ్వనగరాలతో
సీఐఐ ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కామ్‌దే బాధ్యత
ప్రభుత్వ సంస్థల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ కల్పించాలి
శక్తి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తాము నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ.. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీ కన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గిఫ్ట్ సిటీ 700 ఎకరాల్లో మాత్రమే ఉందని, తాము భారత్ ఫ్యూచర్ సిటీని 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్నామని తెలిపారు. పెట్టుబడులకు తెలంగాణ సురక్షితమైన గమ్యం అని, వ్యాపారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులకు ప్రభుత్వం రక్షణగా ఉంటుందని, అడిగిన దానికంటే ఎక్కువ సహకారం అందిస్తామని చెప్పారు. ఎంత పెట్టుబడి పెడతారు, ఎంత మందికి ఉద్యోగాలు కల్పిస్తారో చెబితేమిగతాదంతా తామే చూసుకుంటామన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నార్తర్న్ రీజియన్ కౌన్సిల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిందని, రాజ్యాంగాన్ని రూపొందించి స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చిందని తెలిపారు. ఆర్థిక సంస్కరణల వల్లనే దేశం నేడు ప్రపంచ స్థాయికి ఎదిగిందన్నారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్‌పీజీ) దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు. తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు ఈ విధానాలు తీసుకొచ్చారన్నారు. వ్యాపారులు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పాలసీ పెరాలసిస్ లేదని, నాయకులెరైనా, పార్టీ ఏదైనా.. మంచి విధానాలు తీసుకొస్తే వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు తెచ్చిన కొన్ని మంచి విధానాలను కొనసాగిస్తూనే తాము కొత్త విధానాలను అమలు చేస్తున్నామని, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందని, 2047 నాటికి 10 శాతానికి చేరాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.
ఓఆర్‌ఆర్ లోపల 1.30 కోట్ల జనాభా..
తెలంగాణకు 160 కిమీల ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, ఓఆర్‌ఆర్ లోపల 1.30 కోట్ల జనాభా నివసిస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని సేవా రంగం అభివృద్ధికి వినియోగిస్తున్నామన్నారు. కాలుష్యం, మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు వంటి అంశాలు కొన్ని మెట్రో నగరాలకు సవాళ్లుగా మారాయని, సరైన విధానాలుంటే పెట్టుబడులను ఆకర్షించడం సులభమన్నారు. ఓఆర్‌ఆర్ తర్వాత 360 కిమీల రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, అక్కడ తయారీ రంగ సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. చైనా ప్లస్ వన్ వ్యూహంలో తెలంగాణ కీలకంగా మారుతుందన్నారు. తయారీ రంగంలో చైనా, జపాన్, జర్మనీతో పోటీ పడుతున్నామని చెప్పారు. 2037 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, కేంద్రం ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో మూడు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు. న్యూయార్క్‌తో పోటీ పడే వాతావరణం తెలంగాణలో ఉందన్నారు.
పక్క రాష్ట్రాలతో పోటీ లేదు..
పక్కరాష్ట్రాలతో తెలంగాణకు పోటీ లేదని, తాము టోక్యో, న్యూయార్క్ వంటి నగరాలతో పోటీ పడుతున్నామని సీఎం రేవంత్ అన్నారు. థింక్ గ్లోబల్.. ఇన్వెస్ట్ గ్లోబల్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో నల్సార్, ఐఎ్‌సబీ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థలు ఉన్నాయని, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాలు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు ఏఐ వచ్చిందని, రాత్రికి రాత్రే పరిస్థితులు, ఉద్యోగాల స్వరూపం మారుతోందని, అందుకే నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు. పబ్లిక్--ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని, ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామని అన్నారు. జీసీసీల్లో 200 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని తెలిపారు. అమెజాన్ డేటా సెంటర్ల కోసం రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడుతోందని, అదానీ గ్రూప్ రూ.35వేల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని చెప్పారు.
ఆ బాధ్యత టామ్‌కామ్‌దే
విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతోపాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్‌పోర్టు, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి శక్తి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్య ప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారని సీఎం తెలిపారు. విదేశాల్లోని మ్యాన్‌పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్‌కామ్ చూసుకోవాలని సూచించారు. కార్మికులను విదేశాలకు తరలించే ఏజెంట్ల వివరాలు ేసకరించి.. వారు పంపించే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలన్నారు. ఈ వ్యవహారాల పర్యవేక్షణకుగాను టామ్‌కామ్‌కు మాజీ ఐఎ్‌ఫఎస్ అధికారిని సీఈవోగా నియమిస్తామని చెప్పారు. ఉద్యోగార్థులకు డ్రైవింగ్‌లోనూ శిక్షణ ఇప్పించాలని, విదేశీ భాషలు నేర్పించాలని, సూచించారు. ఇందుకోసం స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్లూ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ పొందేవారందరికీ స్కాలర్‌షి్‌పలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ సంస్థల్లో చదివే విద్యార్థులకు ఇంటర్న్‌షిప్..
ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తద్వారా వారికి స్టయిఫండ్ లభించడంతోపాటు భవిష్యత్తులో చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన నైపుణ్యాలు కూడా నేర్చుకుంటారని తెలిపారు. ఏటీసీల్లో ఈవీ సర్వీసులకు సంబంధించిన కోర్సులు, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. ఇక నర్సుల ేసవలకు దేశీయంగానూ, విదేశాల్లోనూ భారీ డిమాండ్ ఉందని, ఇందుకు అనుగుణంగా నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, శక్తి కార్యదర్శి హరిచందన, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News