ఏసీబీ కస్టడీకి డీఎస్పీ భీమ్ రెడ్డి.. రూ.200 కోట్లకు పైగా ఆస్తులపై విచారణ
ABN , Publish Date - Aug 13 , 2026 | 09:59 AM
హైదరాబాద్‌లో డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, ఆగస్టు 13: అక్రమాస్తుల కేసులో నగరంలోని చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 6న భీమ్ రెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలోని భీమ్ రెడ్డి నివాసాలు, ఇతర ప్రాంతాల్లో కలిపి 16 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించగా.. వాటి బహిరంగ మార్కెట్ విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కస్టడీలో భాగంగా భీమ్ రెడ్డిని బినామీల వ్యవహారంపై ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఆయనకు సంబంధించిన మరిన్ని ఆస్తులు వెలుగులోకి రావాల్సి ఉందగా, ఆదాయానికి మించి ఆస్తులను ఎలా కూడబెట్టారు అనే అంశాలపై వివరాలు సేకరించనున్నారు. అలాగే ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బినామీల పేర్లతో ఆస్తుల కొనుగోలు, ఇతర ఆర్థిక వ్యవహారాలపై కూడా విచారణ జరపనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్