వికసిత్ భారత్ లక్ష్యంలో తెలంగాణ కీలక పాత్ర: భట్టి విక్రమార్క
ABN , Publish Date - Sep 19 , 2026 | 03:41 PM
తెలంగాణ ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, సెప్టెంబర్ 19: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం తెలంగాణ వాటా ఉన్న స్థాయి నుంచి 5 శాతం నుంచి 10 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇందుకోసం కేవలం ప్రభుత్వ రుణాలపై ఆధారపడే విధానానికి పరిమితం కాకుండా ప్రైవేట్, సంస్థాగత పెట్టుబడులను పెద్ద ఎత్తున సమీకరించే దిశగా చర్యలు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలను తీసుకురావడంతో పాటు యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ యువతే రాష్ట్రానికి అతిపెద్ద బలమని, వారి నైపుణ్యాలు, ప్రతిభను వినియోగించుకునేలా ఆర్థికాభివృద్ధి, ఉపాధి రంగాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమతుల్య అభివృద్ధి ఫలాలు అందేలా CURE–PURE–RARE విధానాన్ని అమలు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. దేశాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కేంద్రం.. రాష్ట్రాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం, పెట్టుబడుల ప్రోత్సాహం, యువతకు అవకాశాల కల్పనతో తెలంగాణను వేగవంతమైన ఆర్థికాభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News