Chinese Manja: చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు.
ABN , Publish Date - Jan 14 , 2026 | 09:03 AM
చైనా మంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు. ఆమె మాట్లాడుతూ.. చైనా మాంజాపై నిషేధం ఉందన్నారు. అలాగే.. ఈ మాంజా వల్ల కొంతమంది గాయాలపాలవుతుండగా, మరికొంతమంది చనిపోతున్నారన్నారు. అందుకే దీని విక్రయాలను అడ్డకుంటున్నామన్నారు.
- డీసీపీ రక్షిత కృష్ణమూర్తి
హైదరాబాద్: ప్రజలకు, పక్షులకు హాని కలిగించే చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి(Secunderabad Zone DCP Rakshita Krishnamurthy) పతంగుల దుకాణ యజమానులను హెచ్చరించారు. మంగళవారం చిలకలగూడ, వారాసిగూడ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని వారాసిగూడలో పలు పతంగుల దుకాణాలను అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ శశాంక్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
పతంగుల దుకాణాల్లో చైనా మంజాలు ఉన్నాయో లేదో తనిఖీలు నిర్వహించి, దుకాణంలో ఉన్న పలు మాంజాలను డీసీపీ పరిశీలించారు. చైనా మంజాలను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని దుకాణదారులను హెచ్చరించారు. ఈ సందర్భంగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ పతంగుల దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎటువంటి చైనా మాంజాలు దొరకలేదన్నారు. ప్రమాదాలు తెచ్చే పెట్టే చైనా మంజాలపై యువకులకు,

ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువకులు చైనా మాంజాలను వాడవద్దని సూచించారు. అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు పతంగుల దుకాణాలపై నిఘా పెడతారని, చైనా మాంజాలు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్‌స్పెక్టర్లు అనుదీప్(చిలకలగూడ) మధుసూదన్‌రెడ్డి(వారాసిగూడ), సబ్‌ఇన్‌స్పెక్టర్లు రామచంద్రారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
‘10 నిమిషాల’ డెలివరీ..ఇక రద్దు!
Read Latest Telangana News and National News