Share News

నేడు దక్షిణాది రాష్ట్రాల పోలీసుల భేటీ

ABN , Publish Date - Oct 23 , 2026 | 03:37 AM

దక్షిణాది రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం లక్ష్యంగా తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది.

నేడు దక్షిణాది రాష్ట్రాల పోలీసుల భేటీ
cm revanthreddy

  • ఉగ్రవాదం, డ్రగ్స్‌, సైబర్‌ నేరాల కట్టడిపై చర్చ

  • ముఖ్యఅతిథిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాల పోలీసుల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, అంతర్రాష్ట్ర నేరాల నియంత్రణకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం లక్ష్యంగా తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పోలీసు సమన్వయ సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్‌ నికోబార్‌ దీవులు, పుదుచ్చేరి, లక్షద్వీ్‌పలకు చెందిన డీజీపీలు, ఐజీలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో, సీబీఐ, డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ, సీఐఎ్‌సఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సంస్ధలకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాల అనంతర పరిస్ధితులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర సైబర్‌ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, ఆర్థి నేరాలు, యువత నిరసనలు, మానవ అక్రమ రవాణా తదితర అంశాలు ప్రధాన అజెండాలో ఉన్నాయని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 03:38 AM