శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:34 AM
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సందర్భంగా బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద తనిఖీల్లో బుల్లెట్‌ను అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అక్టోబర్ 6: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద తనిఖీల్లో బుల్లెట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా ప్రయాణికుడి సామగ్రిని పరిశీలిస్తుండగా బుల్లెట్ బయటపడింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అనంతరం బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. సంబంధిత ప్రయాణికుడిని జీఎంఆర్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. బుల్లెట్ ప్రయాణికుడి వద్దకు ఎలా వచ్చింది.. దానికి సంబంధించిన వివరాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులో భద్రతా తనిఖీల సందర్భంగా బుల్లెట్ బయటపడటంతో కొంతసేపు కలకలం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ..
మా ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే.. సీజేపీపై ఏఏఎస్‌యూ విమర్శలు..