Share News

భార్యతో గొడవపడి పిల్లలతో కలిసి నీటిలో దూకిన భర్త.. చివరికి..

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:00 PM

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

భార్యతో గొడవపడి పిల్లలతో కలిసి నీటిలో దూకిన భర్త.. చివరికి..
Nizamsagar Backwaters

సంగారెడ్డి, జూన్ 12: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన కృష్ణ (32) అనే వ్యక్తికి తన భార్య సవితతో గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ తన ఐదేళ్ల కూతురు అనన్య, ఎనిమిదేళ్ల కుమారుడు రక్షిత్‌లతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వద్దకు చేరుకుని ఒక్కసారిగా నీటిలోకి దూకేశాడు.


గమనించిన బాధితుడి బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి బ్యాక్ వాటర్‌లో గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ గాలింపు చర్యల్లో ఐదేళ్ల చిన్నారి అనన్య మృతదేహం లభించగా, తండ్రి కృష్ణ, కుమారుడు రక్షిత్‌ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


ఇవి కూడా చదవండి

మామిడి తొక్కలతో ఇన్ని ఉపయోగాలా! తెలిస్తే ఆశ్చర్యపోతారు

రాబోయే మూడేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి రవికుమార్

Updated Date - Jun 12 , 2026 | 12:07 PM