Share News

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల మృతి

ABN , Publish Date - Sep 16 , 2026 | 08:10 PM

సంగారెడ్డి జిల్లా పెద్ద కంజర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుని ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు.

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థుల మృతి
Sangareddy Ganesh Immersion Incident

సంగారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుని ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పటాన్ చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద కంజర్లలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం వెళ్లిన బాలురు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు.


ఈత రాకపోవడంతో ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు స్థానికంగా ఉన్న శిరీష చారిటబుల్ ట్రస్ట్‌లో చదువుతున్న విద్యార్థులుగా సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుల వివరాలు

  • నర్సింహా రాజు - బిటేక్

  • సుమంత్ - డిప్లమా సెకండ్ ఇయర్

  • గణేష్ - డిప్లమా సెకండ్ ఇయర్

  • ఉదయ్ కిరణ్ - డిప్లమా థర్డ్ ఇయర్

  • శ్యాంకుమార్ - డిప్లమా ఫస్ట్ ఇయర్

  • సిదర్థ్ - టెన్త్

విషాదకరం: ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

వినాయక నిమజ్జనానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గత 15 ఏళ్లుగా అదే ప్రాంతంలో వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్నారని, ఈసారి ప్రమాదం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మంది నిమజ్జనానికి వెళ్లగా.. ఆరుగురు మృతి చెందారని తెలిపారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 16 , 2026 | 09:26 PM