Share News

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

ABN , Publish Date - Jul 01 , 2026 | 09:16 AM

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్, జులై 01: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పార్కు వద్దకు చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


దీనిపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ మృతదేహాన్ని గుర్తు తెలియని మహిళ పార్కులో వదిలి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం

మాటలు రాకపోయినా మాయ చేసింది.. చిన్నారి పాటకు సోషల్ మీడియా ఫుల్ ఫిదా

Updated Date - Jul 01 , 2026 | 09:49 AM