జగిత్యాల: సారంగాపూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం.. 11 మందిపై దాడి
ABN , Publish Date - Jun 20 , 2026 | 10:42 AM
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఆరుబయట నిద్రిస్తున్నవారిపై దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల, జూన్ 20: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఆరుబయట నిద్రిస్తున్నవారిపై దాడి చేసింది. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుక్క దాడితో బాధితులు భయాందోళనతో కేకలు వేయడంతో, స్థానికులు అప్రమత్తమై వాటిని తరిమికొట్టారు.
విషయం తెలుసుకున్న వెంటనే క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగిత్యాల శాసనసభ్యులు (MLA) డాక్టర్ సంజయ్ కుమార్ తక్షణమే స్పందించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర మందులు, యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బీచ్ ఒడ్డున జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే.. ప్రమాదం ఎలా ముంచుకొచ్చిందో చూడండి..
బామ్మ నిర్లక్ష్యం.. సైక్లిస్టుల ప్రాణాల మీదకు వచ్చిందిగా... వీడియో వైరల్