Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 2 గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:53 AM
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
మల్కాజిగిరి (హైదరాబాద్): వసంతపురి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ సాయిరాం ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ గోపాల్(AE Gopal) ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్యనారాయణ కేఫ్, యాదవనగర్, సంజయ్‌నగర్(Yadavanagar, Sanjaynagar), బృందావన్‌కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి, గీతానగర్(Geethanagar), తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనార్దనరావుతో చాలా ఏళ్లుగా స్నేహం
ప్రత్యేక సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవు: ఆర్టీసీ
Read Latest Telangana News and National News