Share News

ఉపాధి కోసం వెళ్లి.. యుద్ధ భూమిలో చిక్కి..

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:51 AM

రష్యాలోని ఆయిల్‌ కంపెనీలో ఉపాధి. మంచి వేతనం’ అన్న ఏజెంట్ల మాటలు నమ్మి.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు నిండా మోసపోయారు.

ఉపాధి కోసం వెళ్లి.. యుద్ధ భూమిలో చిక్కి..
Telangana overseas job fraud

  • ఆయిల్‌ కంపెనీలో ఉపాధి అంటూ రష్యా సైన్యంలో చేర్చిన ఏజెంట్లు

  • మోసపోయిన నలుగురు తెలంగాణ వాసులు

బేగంపేట, నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘రష్యాలోని ఆయిల్‌ కంపెనీలో ఉపాధి. మంచి వేతనం’ అన్న ఏజెంట్ల మాటలు నమ్మి.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు నిండా మోసపోయారు. దీంతో తమవారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం ప్రవాసి ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్‌ చైర్‌పర్సన్‌ గద్వాల్‌ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు.


ఆయిల్‌కంపెనీలో మంచి వేతనంతో ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పడంతో లక్షల రూపాయలు చెల్లించి.. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం నల్లగుట్టతాండా కు చెందిన భుక్యా రవీందర్‌, సిరికొండ మండలం ఒడ్డెరకాలనీకి చెందిన సిర్షుఅశోక్‌, ధర్పల్లి మండలం చెరువుతాండాకు చెందిన మేగావత్‌ ప్రకాష్‌, కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన మహ్మద్‌ అఫ్జల్‌ఖాన్‌ 7నెలల క్రితం రష్యాకు వెళ్లారు. ‘యుద్ధం జరుగుతున్నందున ఆయిల్‌ కంపెనీలు వేతనాలి వ్వడం లేదు. వేరొక కంపెనీలో ఉపాధి కల్పిస్తా మంటూ వారిని ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధ భూమికి పంపించడంతో అక్కడే చిక్కుకుపోయారు. మరోవైపు బాధిత కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ భూపతిరెడ్డిని కలసి వినతిపత్రం అందించారు. ఆయన ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

Updated Date - Sep 30 , 2026 | 06:25 AM