Share News

నిర్మల్‌లో శివాజీ విగ్రహావిష్కరణ వివాదం.. ఎమ్మెల్యేల అరెస్టులతో ఉద్రిక్తత

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:01 PM

నిర్మల్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ చుట్టూ నెలకొన్న వివాదం ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. విగ్రహావిష్కరణ కోసం వస్తున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు తుప్రాన్ వద్ద అడ్డుకున్నారు.

నిర్మల్‌లో శివాజీ విగ్రహావిష్కరణ వివాదం.. ఎమ్మెల్యేల అరెస్టులతో ఉద్రిక్తత

నిర్మల్, ఫిబ్రవరి 22: నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాల్సిన హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

విగ్రహావిష్కరణ కోసం వస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు తుప్రాన్ వద్ద అడ్డుకున్నారు. అటు, భైంసాలో బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్‌ను పోలీసులు గృహనిర్బంధం (హౌజ్ అరెస్ట్) చేశారు. కామారెడ్డికి బయలుదేరుతున్న ఆయనను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వచ్చే వరకు విగ్రహాన్ని ఆవిష్కరించే ప్రసక్తే లేదని రామారావు పాటిల్ స్పష్టం చేశారు.


పోలీసుల మోహరింపు:

విగ్రహావిష్కరణపై వివాదం నెలకొనడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ పరిణామాలతో ఓలా గ్రామం, భైంసా ప్రాంతాల్లో హైటెన్షన్ కొనసాగుతోంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..

ఇది ట్రైలర్ మాత్రమే.. షబ్బీర్ అలీకి వెంకటరమణా రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 06:18 PM