నెల్లూరులో లారీని ఢీకొన్న బస్సు.. డ్రైవర్ మృతి
ABN , Publish Date - Sep 05 , 2026 | 10:21 AM
తిరుపతి నుంచి విజయవాడకు సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. కృష్ణపట్నం సమీపంలో వెంకటరమణ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందగా.. 18 మంది గాయపడ్డారు.
నెల్లూరు, సెప్టెంబర్ 5: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనుబోలు మండలం కృష్ణపట్నం సమీపంలో తిరుపతి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మార్గమధ్యలో బస్సు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతిన్నది. డ్రైవర్ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన చూసి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు...
Read Latest AP News And Telangana News And International News And Telugu News