కేంద్రంలో ఎన్డీఏ హవా.. తెలంగాణపై మోదీ ఫోకస్: ఎంపీ ధర్మపురి అరవింద్
ABN , Publish Date - May 04 , 2026 | 06:07 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత విపక్షాల్లో వణుకు మొదలైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. వివరాల్లోకి వెళితే..
హనుమకొండ, మే 04: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత విపక్షాల్లో వణుకు మొదలైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హనుమకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2028 అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు. లక్ష మందితో ఈ భారీ సభ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగనుందన్నారు. తెలంగాణలో కూడా ఎస్‌ఐఆర్ (SIR) అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ.. ‘వచ్చే రెండు రోజులు కేసీఆర్‌కు టీవీని దూరంగా ఉంచండి, లేదంటే ఆయనకు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కొందరికి పార్టీలు పెట్టడం, డబ్బులు వసూలు చేయడం బిజినెస్‌గా మారింది. కేసీఆర్‌తో ఎలాంటి పొత్తులూ ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండేళ్లు నాన్చి సీబీఐకి అప్పగించారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతుంది. తెలంగాణలో ఆస్తులు అమ్ముకుంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పనుల గురించి ఏం మాట్లాడతాం. సన్నబియ్యం ఇస్తున్నామని సీఎం రేవంత్ అంటున్నారు.. వాస్తవానికి ఆ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోదీనే. కేసీఆర్ పెట్టిన పంగనామాలను రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
కౌంటింగ్ కేంద్రాలు వదలొద్దు.. తుది ఫలితాలు మనవైపే: మమతా బెనర్జీ
ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్‌ని చూసి గర్వపడుతున్నా: ఎస్.ఎ.చంద్రశేఖర్..