జిల్లా ఆసుపత్రిలో పార్కింగ్ పాట్లు
ABN , Publish Date - May 03 , 2026 | 11:44 PM
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన) : భువనగిరి జిల్లా ఆసుపత్రికి వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. అస్తవ్యస్త పార్కింగ్‌తోనే అం బులెన్సల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతున్నదని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ వాహనదారులు సహకరిస్తేనే
సమస్యకు పరిష్కారం
(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన) : భువనగిరి జిల్లా ఆసుపత్రికి వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. అస్తవ్యస్త పార్కింగ్‌తోనే అం బులెన్సల రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారుతున్నదని ఆసుపత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్కింగ్ సమస్యను నియంత్రించేందుకు ఆసుపత్రి అధికారులు గతంలో చేసిన ప్రయత్నాలకు వాహనాదారుల సహాయ నిరాకరణ ఆటంకంగా మారింది.
రోజు వెయ్యి మందికిపైగా ..
బోధనాసుపత్రిగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పనిదినాల్లో ఓపీ సేవలకు సుమారుగా 600 మందికిపైగా రోగులు వస్తుంటారు. ప్రమాదాలు అత్యవసర సేవల కోసం 50మంది వరకు, జిల్లా హోమియో ఆసుపత్రికి 50మంది బాధితులు వ స్తారు. డయాలసిస్, డయాగ్నస్టిక్ హబ్ సేవలకు మరో వంద మందికి పైగా వస్తుంటారు. వైద్యులతో పాటు అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది వందమందికి పైగా విధుల నిర్వహణకు హాజరవుతుంటారు. ఇతర పనుల కోసం మరొక కొద్దిమంది వచ్చి పోతుంటారు.దీంతో రోజువారిగా సుమారుగా వెయ్యిమంది వరకు ఆసుపత్రికి వచ్చి పోతుండగా వారి వెంట వచ్చే సహాయకులు అదనం వీరిలో సగానికి పైగా బైకులు లేదా సొంత వాహనాలలోనే ఆసుపత్రికి వస్తుంటారు. దీంతో ఆసుపత్రి ఆవరణలో ఉదయం నుంచి మధ్యాహ్నం ఓపీ సేవలు ము గిసే వరకు పార్కింగ్ ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వాహనాదారులు అస్తవ్యస్త పార్కింగ్‌తో కొన్ని సందర్భాల్లో నడపడానికి కూడా ఇరుకుగా మారుతున్న పరిస్థితి. పైగా అత్యవసర పరిస్థితుల్లో బాధితులను తరలించేందుకు అంబులెన్సకు కూడా దారి దొరకని పరిస్థితి నెలకొంటున్నది. రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మృత దేహాలను మార్చురిలో భద్రపరిచి పోస్టుమార్టం నిర్వహించే వరకు పెద్దసంఖ్యలో మృతుల బంధుమిత్రులు ఆసుపత్రికి వస్తుండడంతో వారి వాహనాలతో పార్కింగ్ ఇబ్బందులు మరింతగా పెరుగు తుంది.
త్వరలో పెరగనున్న మరింత రద్దీ
జిల్లా ఆసుపత్రికి త్వరలో మరింత రద్దీ పెరగనుంది. మూడో అంతస్తులో క్రిటికల్ వార్డు ఏర్పాటు కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు పూర్తయ్యా యి. త్వరలోనే 50పడకల క్రిటికల్ వార్డు అందుబాటులోకి రానుంది. ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే క్రిటికల్ వార్డు అందుబాటులోకి వస్తే వాహనాల సంఖ్య కూడా పెరగనుంది. అలాగే క్లినికల్ పోస్టింగ్‌లకు వచ్చే వైద్య కళాశాల విద్యార్థుల సంఖ్య 200కు చేరనుంది. వీరిలో సొంత వాహనాలపైనే వచ్చే వి ద్యార్థులే అధికంగా ఉంటారు. మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానుండడంతో అంతే సంఖ్యలో వాహనాలు పెరిగి పార్కింగ్ సమస్య మరింత పెరుగుతుందని ఆసుపత్రి వర్గాలు అంటున్నారు.
అధికారుల ప్రయత్నాలు విఫలం
ఓపీ సమయంలో తలెత్తే పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు గతంలో జిల్లా ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలు వాహనాదారుల సహాయ నిరాకరణతో విఫలమయ్యాయి. గతంలో అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీశైల చిన్న నాయక్ పా ర్కింగ్ సమస్య పరిష్కారానికి కోసం రోగుల, సిబ్బ ంది వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఆసుపత్రి గేటు వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించారు. రోగులను ఆసుపత్రిలో దించిన వెంటనే ఆటో లు, కార్లు తదితర వాహనాలు వెళ్లేలా చర్యలు కట్టుదిట్ట చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు పార్కింగ్ ఇక్కట్లు తీరినప్పటికీ క్రమేపి వాహనాదారుల సహా య నిరాకరణ, వాగ్వాదం పెరగడంతో మళ్లీ సమస్య యథావిధంగా మారింది. అయితే సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలేవి లేకపోవడంతో వానాదారుల ఆలోచన విధానంలో మార్కుతోనే పార్కింగ్ సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు అంటున్నారు.
వాహనాదారులు సహకరించాలి
జిల్లా ఆసుపత్రి రోగులకు వైద్య సేవలు అందించడం కోసమే ఉన్నది. కాని పలువురు వైఖరితో పార్కింగ్ సెంటర్‌గా మారుతున్నది. రోగులు, సిబ్బంది మినహా ఇతరుల వాహనాలను ఆసుపత్రి వెలుపలే నిలుపుకోవాలి. పార్కింగ్ సమస్య పరిష్కారానికి వాహనాదారులు స్వచ్ఛందంగా సహకరించాలి.
డాక్టర్ పాండు నాయక్, సూపరింటెండెంట్, భువనగిరి జిల్లా ఆసుపత్రి