దారుణం.. బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం.. ఇద్దరిపై పోక్సో కేసు..
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:47 PM
నల్లగొండ జిల్లా అనుముల మండలానికి చెందిన ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కొంతకాలంగా నిందితులిద్దరూ చిన్నారిని బెదిరించి లైంగిక దాడికి తెగబడుతున్నారు. దీంతో బాలిక గర్భం దాల్చగా.. నిందితులపై పోక్సో కేసు నమోదు అయ్యింది.
నల్లగొండ: ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. నిందితులిద్దరూ చిన్నారిని బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కొంతకాలంగా నిందితులిద్దరూ చిన్నారిని బెదిరించి లైంగిక దాడికి తెగబడుతున్నారు. పాఠశాలకు వెళ్లే బాలికకు తొలుత ఓ యువకుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అనంతరం ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరో యువకుడికి ఈ విషయం తెలిసింది. దీంతో అందరికీ చెబుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఎవరికీ చెప్పకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు వినాల్సిందేనని హెచ్చరించాడు. ఆపై అతను కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా కొంత కాలం జరిగిన తర్వాత చిన్నారి గర్భం దాల్చింది.
విషయం ఇంట్లో తెలియడంతో చిన్నారిని తల్లిదండ్రులు గట్టిగా నిలదీశాడు. దీంతో అసలు విషయాన్ని ఆమె వెల్లడించింది. వెంటనే పోలీసులను బాధిత తల్లిదండ్రులు ఆశ్రయించారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మరోవైపు యువకులు చేసిన పనికి గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి చిన్నారుల మాన, ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి...
క్షణికావేశంలో కన్నకొడుకుని కర్రతో కొట్టి చంపిన తండ్రి
కొల్లేరు అక్రమ చేపల చెరువుల వివాదంలో సీఈసీ సంచలన ఆదేశాలు