16 విమాన సర్వీసులు రద్దు
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:23 AM
మురసు తుఫాన్ ప్రభావంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం 16 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.
శంషాబాద్ రూరల్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ ప్రభావంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం 16 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. జీఎంఆర్ అధికారుల కథనం ప్రకారం.. తుఫాన్ ప్రభావంతో ఏపీలోని విజయవాడ, రాజమండ్రిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 8 విమానాలు రద్దు కాగా, పై రెండు ప్రాంతాల నుంచి రావాల్సిన మరో 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం