Share News

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: మంత్రి సీతక్క

ABN , Publish Date - Aug 09 , 2026 | 09:58 AM

బోనాల పండగ సందర్భంగా మంత్రి సీతక్క అంబర్‌పేట మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు..

అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: మంత్రి సీతక్క
Minister Seethakka

హైదరాబాద్, ఆగస్టు 9: బోనాల పండుగను పురస్కరించుకుని అంబర్‌పేట మహంకాళి అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రి సీతక్కకు ఆలయ నిర్వాహకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సుఖశాంతులతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.


మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌లు కూడా అంబర్‌పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

డీప్‌ఫేక్‌ వీడియోలపై కేంద్రం కన్నెర్ర.. చర్యలు తీసుకోవాలని మెటాకు అదేశం..

Updated Date - Aug 09 , 2026 | 12:17 PM