Share News

ప్రమాదకరంగా మేడిగడ్డ డ్యామ్.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:31 PM

మేడిగడ్డ బ్యారేజ్‌‌ను క్యాటగిరి-1 ప్రమాదకర డ్యామ్‌గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే దేశంలోని డ్యామ్‌ల భద్రతపై పార్లమెంటులో కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది..

ప్రమాదకరంగా మేడిగడ్డ డ్యామ్.. కేంద్రం కీలక వ్యాఖ్యలు..
Medigadda Barrage

ఢిల్లీ: మేడిగడ్డ బ్యారేజ్ భద్రతపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. మేడిగడ్డ బ్యారేజ్‌ను క్యాటగిరి-1 ప్రమాదకర డ్యామ్‌గా గుర్తించినట్లు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. దేశంలో డ్యామ్‌ల భద్రతపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీలు లక్ష్మీనారాయణ, బైరెడ్డి శబరిలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి సమాధానం ఇచ్చారు.


గత ఏడాది వర్షాకాలం అనంతరం నిర్వహించిన తనిఖీల్లో మేడిగడ్డ బ్యారేజ్‌కు సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. డ్యాం భద్రతకు సంబంధించిన కొన్ని లోపాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా 50 ఏళ్లకు పైబడిన డ్యామ్‌ల సంఖ్య 1,681గా ఉందని కేంద్రం వెల్లడించింది. గత ఏడాది వర్షాకాలానికి ముందు 6,524 డ్యామ్‌లు, వర్షాకాలం అనంతరం 6,553 డ్యామ్‌లను తనిఖీ చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. డ్యామ్‌ల భద్రతపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

Updated Date - Jan 29 , 2026 | 06:50 PM