Share News

కలలో రక్తం చిందినట్లు పీడకలలు.. చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..

ABN , Publish Date - Jul 18 , 2026 | 04:04 PM

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో ఓ యువతి గుడిలోని అమ్మవారి విగ్రహం తీసుకెళ్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, హైడ్రా బృందాలు విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

కలలో రక్తం చిందినట్లు పీడకలలు.. చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..
Peerzadiguda Incident

మేడ్చల్, జులై 18: జిల్లా పరిధిలోని పీర్జాదిగూడలో ఓ యువతి, గుడిలోని అమ్మవారి విగ్రహం తీసుకెళ్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువతి మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు, హైడ్రా బృందాలు.. విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా దేవుపల్లి గ్రామానికి చెందిన అరుణ (52), ఆమె కూతురు తేజస్విని (25) గత కొంతకాలంగా శంకర్ నగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటున్నారు. తేజస్విని గత ఆరు నెలల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసి.. రాజీనామా చేసింది. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటోంది. అయితే, నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి వేళ తేజస్విని నగ్నంగా స్థానిక ఆలయానికి వెళ్లి, అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, చీరను తీసుకుని పక్కనే ఉన్న పీర్జాదిగూడ చెరువులోకి దూకేసింది. ఉదయం తేజస్విని మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, హైడ్రా (HYDRAA), డిఆర్ఎఫ్ (DRF) సిబ్బంది.. చెరువులో యువతి మృతదేహాన్ని వెలికి తీశారు.

చెరువు సమీపంలోని సీసీకెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. తేజస్విని సమీపంలోని గుడిలో అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని నగ్నంగా చెరువులో దూకినట్లు కనిపించింది. ఇప్పటికే తేజస్విని మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు.. అమ్మవారి విగ్రహం కోసం గాలిస్తున్నారు.


తేజస్విని ఆత్మహత్యకు కారణమదేనా?

ఈ ఉదంతం వెనుక కుటుంబ కలహాలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. తేజస్విని తండ్రి ఈశ్వరరావు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తుండగా, భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాల కారణంగా ఈ కుటుంబం విడిపోయింది. తల్లి, కూతురు ఇద్దరూ ఒంటరిగానే పీర్జాదిగూడలో నివసిస్తున్నారు. గత ఆరు నెలలుగా తమకు రాత్రి పూట భయంకరమైన పీడకలలు వస్తున్నాయని, కలలో రక్తం చిందినట్లు వింత వింత దృశ్యాలు కనిపిస్తూ తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తున్నాయని తల్లి అరుణ పోలీసులకు తెలిపింది. తల్లి, కుమార్తె ఇద్దరి మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మానసిక క్షోభ, మూఢనమ్మకాలు ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఫేక్‌ సర్టిఫికెట్లపై దక్షిణ డిస్కం ఫోకస్‌

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 18 , 2026 | 04:53 PM