Share News

సంగారెడ్డి జిల్లా బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..

ABN , Publish Date - Jul 21 , 2026 | 07:46 AM

సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 161పై ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు.

సంగారెడ్డి జిల్లా బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి..
Sangareddy Road Accident

సంగారెడ్డి జిల్లా: నిజాంపేట్ మండలం బాచుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి 161పై ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ప్రమాదవశాత్తూ స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురు మృతిచెందారు. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి స్కార్పియో పల్టీలు కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది.


మృతుల్లో భార్యాభర్తలతో పాటు వారి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను నాందేడ్ వాసులుగా గుర్తించారు. వారంతా నాందేడ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి
ఆల్మట్టికి స్వల్పంగా వరద

మల్లారెడ్డి గ్రూప్‌ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు

Updated Date - Jul 21 , 2026 | 08:02 AM