Share News

జయశంకర్ భూపాలపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎల్ అండ్ టీ క్యాంప్ కార్యాలయం దగ్ధం!

ABN , Publish Date - May 24 , 2026 | 05:34 PM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

జయశంకర్ భూపాలపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎల్ అండ్ టీ క్యాంప్ కార్యాలయం దగ్ధం!
Jayashankar Bhupalpally fire,

జయశంకర్ భూపాలపల్లి, మే 24: జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ క్యాంప్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కార్యాలయమంతా వ్యాపించాయి. దీంతో క్షణాల వ్యవధిలోనే ఆఫీస్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాద తీవ్రత కారణంగా కార్యాలయంలో భద్రపరిచిన ప్రాజెక్టులకు సంబంధించిన విలువైన రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనా లేక ఎవరైనా కావాలనే కుట్రపూరితంగా నిప్పు పెట్టారా అనే కోణంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రమాదంపై ఇంజినీరింగ్ అధికారులు స్పందిస్తూ.. సమీపంలోని వరి పొలానికి నిప్పంటించడం వల్ల, ఆ మంటలు గాలికి వేగంగా వ్యాపించి ఎల్ అండ్ టీ కార్యాలయాన్ని చుట్టుముట్టాయని ప్రాథమికంగా వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం.. తిరుపతి శిల్పారామం దగ్గర హిందూ సంఘాల నిరసన

గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కీలక మార్పులు.. కేంద్రం కొత్త నిబంధనలివే..

Updated Date - May 24 , 2026 | 05:40 PM