Share News

కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం.. తిరుపతి శిల్పారామం దగ్గర హిందూ సంఘాల నిరసన

ABN , Publish Date - May 24 , 2026 | 01:20 PM

తిరుపతిలోని శిల్పారామం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు యత్నించాయి.

కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం.. తిరుపతి శిల్పారామం దగ్గర హిందూ సంఘాల నిరసన
Tirupati sadhus protest

అమరావతి, మే 24: తిరుపతిలోని శిల్పారామం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు యత్నించాయి. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత నిరసనను అడ్డుకోవటం ఏంటని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఓ సాధువు మాట్లాడుతూ.. ‘తిరుమల రాజకీయాలకు అతీతమైన క్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకటేశ్వరస్వామితో అనుబంధం ఉంది’..


‘భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. అదృష్టం కొద్దీ ఆయన రెండు సార్లు టీటీడీకి చైర్మన్ అయ్యారు. అలాంటి ఆయన వెంకటేశ్వర స్వామి సేవలో ఉండాలి. కానీ, తిరుమలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఆయన చేసిన పాపాలకు వెంకటేశ్వర స్వామికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. సాధు, సంతులను చూసైనా భూమనలో మార్పు వస్తుందని కోరుకుంటున్నాము. కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే’ అని డిమాండ్ చేశారు. కాగా, సాధువులు రోడ్డుపైకి వస్తే దాడి చేసేందుకు వైసీపీ శ్రేణులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

చింతపండు డేట్స్‌ చట్నీ.. ఇలాచేస్తే ఆ రుచే వేరుగా..

కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని

Updated Date - May 24 , 2026 | 01:26 PM