మావోయిస్టు నేత సుశీలరాణి లొంగుబాట
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:35 AM
మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నక్క సుశీలరాణి మంగళవారం నిజామాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
రూ.5లక్షల రివార్డు, రూ.25వేల ఆర్థిక సాయాన్ని
అందజేసిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
నిజామాబాద్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మూడు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నిజామాబాద్ జిల్లాకు చెందిన నక్క సుశీలరాణి మంగళవారం నిజామాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటు, పునరావాస విధానం కింద.. సుశీలపై ఉన్న రూ.5లక్షల రివార్డుతో పాటు ఆర్థిక సహాయంగా రూ.25వేలను నిజామాబాద్ కమిషనర్ సాయిచైతన్య ఆమెకు అందజేశారు. బోధన్‌లోని శక్కర్‌నగర్‌కు చెందిన సుశీల 1992 నుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ డీవీసీలో డివిజన్ కమిటీ సభ్యురాలిగా(డీసీఎం), ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కమిటీ(ఈడీసీ) సభ్యురాలిగా పనిచేశారు. సుశీల తండ్రి రామకృష్ణ నిజాంషుగర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేశారు. సుశీల విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే కొనసాగగా డిగ్రీ చదువుతున్న సమయంలో ఉద్యమం వైపు ఆకర్షితురాలై అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం, దండకారణ్యం, ఛత్తీస్‌గఢ్ మాడ్ తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో సుశీల కీలక బాధ్యతలు నిర్వహించారని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి.. సీఎం చంద్రబాబు నివాళులు
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు