Share News

సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మమునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Jan 29 , 2026 | 07:59 PM

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లే మమునూరు ఎయిర్‌పోర్ట్‌ కల నెరవేరుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాకముందు మమునూరు అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా ఉండేదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మమునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Minister Ram Mohan Naidu

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చొరవ వల్లే మమునూరు ఎయిర్‌పోర్ట్‌ కల నెరవేరుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. స్వాతంత్య్రం రాకముందు మమునూరు అతిపెద్ద ఎయిర్‌‌పోర్ట్‌గా ఉండేదని అన్నారు. మమునూరు ఎయిర్‌పోర్ట్‌కు 696 ఎకరాలు మాత్రమే ఉందని, అయితే 180 సీట్ల విమానం దిగాలి అంటే రన్ వే పొడవు 2500 మీటర్లు ఉండాలని మంత్రి తెలిపారు (Mamunuru Airport news).


మమునూరు ఎయిర్‌పోర్ట్ కల నెరవేరాలంటే మరో 259ఎకరాలు అవసరమని మంత్రి తెలిపారు. గతంలో ఎవరూ ఆ భూమిని సేకరించలేదని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డ్ టైమ్‌లో రైతులను ఒప్పించి భూమి సేకరించిందని ప్రశంసించారు. ఏవియేషన్ మంత్రిగా ఎక్కువ ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించాలనేది తన లక్ష్యమని, రాష్ట్రాలు సహకరించి భూములు ఇస్తే కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ తర్వాత గొప్ప వారసత్వ నగరమైన వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా.. నిర్మాణం చేసుకోలేక పోయామని, ఇప్పుడు ఆ కల నెరవేరుతోందని అన్నారు (Ram Mohan Naidu statement).


శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ 5వేల ఎకరాల్లో నిర్మిస్తామంటే అందరూ నవ్వారని, అన్ని వేల ఎకరాలు ఉండటం వల్లే నేడు ఆపరేషన్, మెయింటెనెన్స్, రిపేర్ కేంద్రాలకు వీలు అవుతోందని మంత్రి పేర్కొన్నారు (Telangana airport development). అందువల్లే హైదరాబాద్ ఏవియేషన్ హబ్‌గా ఎదిగిందన్నారు. పోటీపడి రాజకీయాలు చేయడం కాదు.. అభివృద్ధి చేయాలని తమ గురువు చంద్రబాబు నేర్పించారని అన్నారు. తెలంగాణను కూడా అభివృద్ధి చేయాలని తమ గురువు చంద్రబాబు చెప్పారని మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హార్వర్డ్ విద్యార్థులు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి: సీఎం రేవంత్‌

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. కీలక నిబంధనలివే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 08:18 PM