Share News

ఆయుధాల చోరీ కేసు.. మల్లేష్ కస్టడీకి మల్కాజ్‌గిరి కోర్టు అనుమతి

ABN , Publish Date - Sep 13 , 2026 | 04:42 PM

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో నిందితుడు, మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్‌కు రెండు రోజుల కస్టడీకి మల్కాజ్‌గిరి కోర్టు అనుమతించింది. వివరాల్లోకి వెళితే..

ఆయుధాల చోరీ కేసు.. మల్లేష్ కస్టడీకి మల్కాజ్‌గిరి కోర్టు అనుమతి
Mallesh Arms Theft Case

హైదరాబాద్, సెప్టెంబర్ 13: బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసులో నిందితుడు, మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్‌కు రెండు రోజుల కస్టడీకి మల్కాజ్‌గిరి కోర్టు అనుమతించింది. దీంతో ఎల్లుండి నిందితుడిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కేసులో నిందితుడి పాత్ర, ఘటనకు దారితీసిన పరిస్థితులు, అతడితో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీయనున్నారు. ఇప్పటికే దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా మల్లేష్‌ను ప్రశ్నించి, మరిన్ని కీలక విషయాలను రాబట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.


కస్టడీ సమయంలో నిందితుడి నుంచి పూర్తి సమాచారం సేకరించి దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మల్లేశ్‌కు ఎవరెవరు సహకరించారు, మరేదైనా కుట్ర ఉందా, గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. నిందితుడి వాంగ్మూలంతో పాటు ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆధారాలను సరిపోల్చిన కేసులో వాస్తవాలను నిర్ధారించనున్నారు. కస్టడీ విచారణ పూర్తయిన అనంతరం మల్లేష్ అలియాస్ రాజును తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్

Updated Date - Sep 13 , 2026 | 05:53 PM