కాంట్రాక్టు వ్యవస్థలో అన్యాయం జరుగుతోంది.. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు
ABN , Publish Date - May 30 , 2026 | 04:28 PM
హైదరాబాద్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్, మే 30: నగరంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. కాంట్రాక్టర్ల సమస్యలు, హామీల అమలు తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..‘కేసీఆర్ హయాంలో అధికారులకు స్వేచ్ఛనిచ్చి పని చేయమని చెప్పారు. ఒక్కో విద్యార్థి మీద ప్రత్యేక దృష్టి పెట్టి తొమ్మిదిన్నర ఏళ్ళు చదివించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇచ్చారు. రేవంత్.. పేమెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నాడు. మూడు నెలల్లో పిల్లలు పుడతారా అని సీఎం అంటున్నాడు. మూడు నెలల్లో పిల్లలు పుట్టరని తెలుసు.. 30నెలల్లో కూడా పిల్లలు పుట్టకుంటే ఏమంటారు? కాంట్రాక్టులన్నీ సీఎం బామ్మర్దికి, మంత్రి పొంగులేటి కొడుకుకు వస్తున్నాయి. ముఖం బాగాలేక అద్దం పగుల కొట్టినట్లు ఉంది పరిస్థితి . కేసీఆర్ అప్పుల పాలు చేశారు అంటున్నాడు. కేసీఆర్ అప్పు చేసి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఢిల్లీకి పోదాం.. జీవో నెంబర్ 17 రద్దు అయ్యేవరకు పోరాడుదాం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. సెక్యూరిటీ లేకుండా రోడ్డు మీదకు రండి.. మీకు పరిస్థితి తెలుస్తుంది. మళ్ళీ 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది’ అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..