కరువు సమయంలో గోబెల్స్ సమ్మిట్లెందుకు!?
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:20 AM
‘‘రాష్ట్రం కరువు, కరెంట్ కోతలతో తల్లడిల్లుతుంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో సీఎం గోబెల్స్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధమవుతున్నారు.
మూసీ సుందరీకరణ పేరిట
లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రం కరువు, కరెంట్ కోతలతో తల్లడిల్లుతుంటే గ్లోబల్ సమ్మిట్ పేరుతో సీఎం గోబెల్స్ సమ్మిట్ నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో వేల కోట్ల రూపాయలను తమ ప్రచారం కోసం వృథా చేస్తున్నారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌తో ఒక్క పెట్టుబడి, ఒక్క ఉద్యోగం రాలేదు. అందుకే అది ‘గోబెల్స్ సమ్మిట్’’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఒకవైపు, పొదుపు మంత్రం పాటించాలని చెబుతూ, వందల కోట్లు ప్రచారం, ఫ్లెక్సీలు, ప్రకటనలకు దుబారా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్లోబల్ సమ్మిట్‌లో పెట్టుబడిదారులకు చెబుతారా? అని ప్రశ్నించారు. మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విదేశీ పర్యటనలు, ప్రకటించిన ఎంఓయూలు, వచ్చిన పెట్టుబడులు, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలెన్నో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు నీరు లేక, కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతుంటే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర కోట్ల దోపిడీకి స్కెచ్ వేశారని ఆరోపించారు. ఆ ప్రాజెక్టును వెంటనే నిలిపేసి లక్షన్నర కోట్లను కరువు నివారణ చర్యలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. అసలు ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎలాంటి డీపీఆర్ లేదని, దమ్ముంటే.. దాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సవాల్ విసిరారు.
చంద్రబాబు తీరును అభినందిస్తున్నా
తెలంగాణ కన్నా తక్కువ వర్షపాతం ఉన్నా.. ఏపీలో కరువు లేదని, అక్కడి సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నీళ్లు ఎత్తిపోసుకున్నారని, అందుకే కరువు, క్రాప్ హాలిడేలు లేవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చంద్రబాబు తీరును అభినందిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో లోటు వర్షపాతం 17-20 శాతం మాత్రమే ఉందని, అయినా, సీఎం రేవంత్ వల్లే కరువు వచ్చిందని ఆరోపించారు. రైతులకు సాగు నీటికి, ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతుండగా, పరిశ్రమలకూ విద్యుత్ కోతలు విధించే పరిస్థితి రావడం ప్రభుత్వ పాలన వైఫల్యమని విమర్శించారు. పవర్ హాలిడే ప్రకటించడంతో పారిశ్రామిక రం గానికి తీవ్రనష్టం జరుగుతోందని, ఇండస్ట్రీలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పథకాలకు, అన్ని రంగాలకు హాలిడే ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు హాలిడే ఇస్తే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందన్నారు.
క్షమాపణలు చెప్పేవారు ఇంకా ఉన్నారు
నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు ఎప్పుడో చెప్పారని, కొండా సురేఖ మాదిరిగా తనకు క్షమాపణలు చెప్పేవారు ఇంకా చాలామంది ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై తన లీగల్ టీమ్‌తో చర్చిస్తానన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!
ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు