Share News

ఫోన్‌ చూస్తోందని కూతురిని గొంతు పిసికి చంపిన తల్లి

ABN , Publish Date - Oct 30 , 2026 | 03:44 AM

తరచూ ఫోన్‌ మాట్లాడుతోందని, వద్దని ఎంత చెప్పినా వినడం లేదనే కోపంతో కన్న కూతురిని ఓ తల్లి చంపేసింది.

ఫోన్‌ చూస్తోందని కూతురిని గొంతు పిసికి చంపిన తల్లి
dcp press meet

  • ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం

  • రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ మండల కేంద్రంలో ఘటన

కొత్తూర్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తరచూ ఫోన్‌ మాట్లాడుతోందని, వద్దని ఎంత చెప్పినా వినడం లేదనే కోపంతో కన్న కూతురిని ఓ తల్లి చంపేసింది. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌ లో ఈ ఘటన జరిగింది. షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ శిరీష రాఘవేందర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తూర్‌లో రాజు, విజయలక్ష్మి దంపతులకు వీరికి ముగ్గురు సంతానం. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల పెద్ద కూతురు తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో తల్లి పలుమార్లు మందలించింది. ఈనెల 27న రాజు, విజయలక్ష్మి పని కోసం బయటకు వెళ్లారు. సాయంత్రం విజయలక్ష్మి ఒక్కత్తే ఇంటికొచ్చింది. పెద్ద కూతురు బడికి వెళ్లకపోగా, ఫోన్‌ చూస్తూ కనిపించింది. పట్టలేని ఆగ్రహంతో ఊగిపోయిన విజయలక్ష్మి.. కూతురు గొంతు పిసికింది. ఊపిరాడకపోవడంతో ఆ బాలిక మృతిచెందింది. ఆ వెంటనే భర్తకు ఫోన్‌ చేసిన విజయలక్ష్మి తాను ఇంటికొచ్చేసరికి బిడ్డ ఉరివేసుకుందని చెప్పింది. అతడు ఇంటికొచ్చి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా తానే చంపినట్లు ఆమె అంగీకరించింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 03:56 AM