Share News

కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Aug 17 , 2026 | 09:30 PM

కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సును లారీ ఢీకొట్టడంతో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..

కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు
Kondagattu Road Accident

జగిత్యాల, ఆగస్టు 17: జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో బస్సులో ఉన్న సుమారు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుగా వచ్చిన లారీ ఒక్కసారిగా బస్సును ఢీకొనడంతో భారీగా కుదుపునకు గురైన బస్సులో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతకు పలువురు ప్రయాణికులు సీట్ల మధ్య చిక్కుకోవడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.


సమాచారం అందుకున్నపోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసి, వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


ఈ వార్తలనూ చదవండి:

మోదీ ప్రభుత్వం కోసం.. పోలీస్ జాబ్‌కు రాజీనామా!

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్

Updated Date - Aug 17 , 2026 | 09:35 PM