మోదీ ప్రభుత్వం కోసం.. పోలీస్ జాబ్‌కు రాజీనామా!
ABN , Publish Date - Aug 17 , 2026 | 07:22 PM
జంతర్ మంతర్ వద్ద యువత నిరసనల నేపథ్యంలో కలత చెందిన ఓ గుజరాత్ పోలీసు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జంతర్ మంతర్ వద్ద యువత నిరసనల నేపథ్యంలో కలత చెందిన ఓ గుజరాత్ పోలీసు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి రంగంలోకి దిగడం తన నైతిక బాధ్యతగా భావిస్తున్నానని రామ్‌గర్ గోసాయ్ తెలిపారు. తూర్పు కచ్‌లోని అడేసార్ పోలీస్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు.
‘నేను ఈ ప్రభుత్వ జాబ్ కోసం ఎంతో కష్టపడ్డాను. అయితే, ఇటీవల జరిగిన నిరసనల నేపథ్యంలో యువత కోసం మోదీ ప్రభుత్వం ఎంతో చేసింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వానికి సంఘ్‌కు మద్దతుగా ఉండేందుకు నేను కానిస్టేబుల్ పోస్టుకు రాజీనామా చేస్తున్నాను. నా జీవితాన్ని, సేవలను ఆర్ఎస్ఎస్‌కు అంకితం చేసేందుకు నిర్ణయించుకున్నాను. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆర్ఎస్ఎస్ దేశ సేవకు అంకితమైంది’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసనలే తన ప్రయాణాన్ని మరో మలుపు తిప్పాయని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రశాంత్ కిషోర్
ఎన్‌టీఏ ప్రక్షాళన.. 50 మందికి పైగా సిబ్బంది తొలగింపు..!