Share News

కేటీఆర్‌పై చేసినవ్యాఖ్యలకు చింతిస్తున్నా!

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:47 AM

మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు

కేటీఆర్‌పై చేసినవ్యాఖ్యలకు చింతిస్తున్నా!
Konda Surekha

  • నాటి రాజకీయ పరిస్థితుల వల్లే మాట్లాడా

  • ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదు

  • ఆ మాటల్ని ఉపసంహరించుకుంటున్నా

  • ‘ఎక్స్‌’లో మాజీ మంత్రి కొండా సురేఖ పోస్ట్‌

వరంగల్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో అలా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని తెలిపారు. నాడు తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందన్నారు. కేటీఆర్‌, వారి కుటుంబం సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్ఠకు భంగం కలిగించేలానే దురుద్దేశం గానీ తనకు లేవని తెలిపారు. తన వ్యాఖ్యలు కేటీఆర్‌ను, వారి కుటుంబాన్ని నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సినీ నటులు నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆర్‌ బాధ్యుడంటూ 2024అక్టోబరు 2న ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. దీనిపై నాగార్జున కోర్టులో కేసు వేయగా.. సురేఖ తనవ్యాఖ్యలనుఉపసంహరించుకోవడంతోపాటు విచారం వ్యక్తం చేశారు. దీంతో నాగార్జున కేసు వెనక్కి తీసుకున్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి కేటీఆర్‌ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో సురేఖ వెనక్కి తగ్గడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేసుల నుంచి ఉపశమనం కోసమే సురేఖ వెనక్కి తగ్గారని, గులాబీ గూటికి చేరేందుకు లైన్‌క్లియర్‌ చేసుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం.. ఇంట్లో పాతిపెట్టిన మూడు డ్రమ్ముల్లో భారీగా నగదు..!

ఢిల్లీ టీటీడీలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాలు

Updated Date - Oct 30 , 2026 | 02:48 AM