ఖమ్మంలో విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Sep 12 , 2026 | 09:39 AM
ఖమ్మం జిల్లా ముదిగొండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని సూసైడ్ నోట్, వినయ్ అనే యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..
ఖమ్మం, సెప్టెంబర్ 12: జిల్లాలోని ముదిగొండ మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినయ్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని.. వారి వేధింపులు తట్టుకోలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఉదయం ఎంతకీ వినయ్ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. ఉరికి వేలాడుతూ కనిపించడంతో ఆవేదనతో కన్నీరుమున్నీరయ్యారు.
మృతుడు వినయ్ గతంలో ఒక ఫోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉండి.. జైలుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే అతను న్యాయస్థానం నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘సూపర్ సిక్స్’తో ఆర్థిక భద్రత
హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు
Read Latest AP News And Telangana News