ఇంజక్షన్ వికటించి 13 ఏళ్ల విద్యార్థిని మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన
ABN , Publish Date - Aug 10 , 2026 | 12:07 PM
ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఓ చిన్నారికి.. ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ చేయడంతో పరిస్థితి విషమించి ఆ బాలిక మృతిచెందింది.
ఖమ్మం, ఆగస్టు 9: జిల్లాలోని కొణిజర్ల మండలంలో లీవ్ర విషాదం చోటుచేసుకుంది. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఓ 13 ఏళ్ల చిన్నారికి ఆర్ఎంపీ వైద్యుడు ఇంజక్షన్ చేయడంతో పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురం గ్రామంలో జరిగింది.
మృతి చెందిన బాలిక బస్వాపురం గ్రామ సమీపంలోని కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ విధ్యార్థినిని కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. వైద్యుడు ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం ఆమె మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు..
ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై కొణిజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి, విద్యార్థిని మృతికి గల కారణాలను తేల్చాల్సి ఉంది. వైద్యుడి చికిత్స, ఇంజక్షన్‌కు సంబంధించిన వివరాలతో పాటు ఇతర అంశాలనూ అధికారులు విచారించనున్నారు. బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నటిపై అత్యాచారం.. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్..
ఎయిర్‌ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!