Share News

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:28 PM

ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేశారు. సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.

ఖైరతాబాద్‌ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌..
Danam Nagender

ఇంటర్నెట్ డెస్క్: ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్‌ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేశారు. సెప్టెంబర్ 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత నేపథ్యంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది (Khairatabad seat vacant).


దానం నాగేందర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు (Khairatabad gazette notification). అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిరాయింపు పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు.. 2024 ఏప్రిల్ 23 నుంచే ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడని తీర్పు ఇచ్చింది. అదే తేదీ నుంచి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా పరిగణించాలని పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

టీఎంసీ పేరు, గుర్తు వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక డెడ్‌లైన్..


పార్కింగ్ ఛార్జీలు డబుల్, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కొత్త ప్లాన్..

Updated Date - Sep 28 , 2026 | 05:39 PM