మహిళలకు అవకాశాలిచ్చేందుకే పార్టీ పెట్టా
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:59 AM
మహిళలకు అవకాశాలు ఇచ్చేందుకే తాను పార్టీ పెట్టానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు
పార్లమెంటు వరకు జెండా ఎగురవేయాలి: కవిత
రాంనగర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మహిళలకు అవకాశాలు ఇచ్చేందుకే తాను పార్టీ పెట్టానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు మహిళలు జెండా ఎగురవేసేందుకు తాను మద్దతుగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారంనిర్వహించిన రాజ్యాంగ దివస్ సదస్సుకు ఆమె ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలను మనుషులుగా గుర్తించింది భారత రాజ్యాంగం మాత్రమేనని, ఆ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబరు 26నే మన(మహిళల)కు అసలు సిసలైన పండగరోజని అన్నారు. రాజ్యాంగం మహిళలకు అన్ని హక్కులు కల్పించినా దురదృష్టవశాత్తూ ఆ హక్కులను వినియోగించుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లు తమ చరిత్రను తామే రాసుకోవాలని, లేదంటే చరిత్ర ఉండదని పేర్కొన్నారు. మహిళలకు పెన్షన్లు, బంగారం, సైకిళ్లు ఇస్తామని అబద్ధాలు చెప్పడం కాదు, వారికి ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఇవ్వాలని రాజకీయ పార్టీలకు సూచించారు. మహిళలకు పదవుల్లో ప్రాధాన్యత దక్కాలని అన్నారు. పార్టీ మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా నామకరణం చేస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రుద్రమ సేన పోస్టర్లను మహిళలతో ఆమె కలిసి ఆవిష్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్