Share News

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:15 AM

మత్తు పదార్థాలు, మద్యం, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ భుక్య రాంరెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని మండలంలోని హన్మంతునిపేట బృందావన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు.

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి

పెద్దపల్లి రూరల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలు, మద్యం, గంజాయి వంటి వాటికి యువత దూరంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ భుక్య రాంరెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి రూరల్‌ ఎస్‌ఐ మల్లేష్‌ ఆధ్వర్యంలో అరైవ్‌ అలైవ్‌ కార్యక్రమాన్ని మండలంలోని హన్మంతునిపేట బృందావన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మోటివేటర్‌, ప్రవచనకర్త డాక్టర్‌ ఎస్పీ నాయక్‌ మహరాజ్‌ తన కళా బృందంతో పాటల రూపంలో మత్తు పదార్థా లకు బానిస కావద్దని, వాటి వల్ల కలిగే ప్రమా దాలు, నష్టాలపై వివరించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటిం చాలని, వాహనదారుడు సీట్‌ బెల్ట్‌, హెల్మెట్‌ ధరించాలన్నారు. యువత చెడు మార్గాలకు వెళ్ళ కుండా ఉండాలన్నారు. అరైవ్‌ అలైవ్‌ అనే ప్రోగ్రాం సారాంశం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షి తంగా ఇంటికి చేరుకోవాలనేది ముఖ్య ఉద్య్దేశ మన్నారు. ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ చట్టాలను అనుసరించాలన్నారు. ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, రూరల్‌ ఎస్‌ఐ శ్వేత, హనుమంతునిపేట, మారేడుగోండ, భోజన్నపేట, చీకురాయి, గుర్రంపల్లి గ్రామాల సర్పంచ్‌లు మ్యాడగోని శ్రీనివాస్‌గౌడ్‌, గుర్రం దేవేంద్ర నాగ రాజు, శ్వేతవెంకటేష్‌, బండారి త్రివేణి, ఓదెల శ్రీనివాస్‌, రాజయ్య, ఉప సర్పంచ్‌ మేకల కుమార్‌ యాదవ్‌లతో బృందం సభ్యులు గంగాధర్‌ నాయక్‌, నాగరాజు నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:15 AM