మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:46 PM
మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలవుతే వారి భవిష్యత్ నాశనం అవుతుందని పెద్దపల్లి డీసీపీ భ్యూక రాంరెడ్డి అన్నారు. స్థానిక శివకిరణ్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన ప్రజాపా లన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదలు, వాటి నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మంథని, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు బానిసలవుతే వారి భవిష్యత్ నాశనం అవుతుందని పెద్దపల్లి డీసీపీ భ్యూక రాంరెడ్డి అన్నారు. స్థానిక శివకిరణ్ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన ప్రజాపా లన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం, అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదలు, వాటి నివారణ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై కఠిన చర్యలు తీసు కుంటామన్నారు. విద్యార్థి దశ నుంచి మంచి లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి కష్టపడి చదువుకోవాలన్నారు. ఉన్నత స్థానానికి ఎదిగి తల్లి దండ్రులకు, ఊరికి మంచి పేరు తీసుకు రావా లన్నారు. ప్రమాదాల నివారణకు యువత రోడ్డు భద్రత సూచనలను పాటించాల న్నారు. సైబర్ నేరాలపై అప్రమ త్తంగా ఉండాలన్నారు. కార్యక్ర మంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కుడుదుల వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేం దర్‌రెడ్డి, కమిషనర్ మనోహర్ రెడ్డిలు మాట్లాడారు. కార్యక్ర మంలో ఎస్‌ఐ రమేష్, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.