యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Jun 23 , 2026 | 11:52 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత భవిష్యత్తును పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గర్రెపల్లి సోషల్ వేల్ఫేర్ గురుకుల విద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సుల్తానాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో ఉన్నత భవిష్యత్తును పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గర్రెపల్లి సోషల్ వేల్ఫేర్ గురుకుల విద్యాలయంలో మంగళవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సీపీ మాట్లాడుతు విద్యార్థులు తల్లిదండ్రుల గురించి, కన్న వారి గురించి ఆలోచిస్తూ ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. చెడు అలవాట్లకు లోనై చదువును పక్కన పెట్టి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నప్పుడు మత్తు పదార్థాల జోలికి వెళ్ళరని, వారిని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు అభినందనీయులన్నారు. చదువుతోపాటు సమాజంలో బాధ్యతాయుత పాత్ర పోషించాలని, వార్డులలో, కాలనీలలో మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు ఆవగాహన కల్పిస్తూ యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా వ్యవహరించాలన్నారు. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయని హెచ్చరించారు. సీఐ రంజిత్ కుమార్, ఎంఈఓ అరేపల్లి రాజయ్య, పెద్దపల్లి నార్కోటిక్ టీమ్ ఇన్స్‌పెక్టర్ రాజ్‌కుమార్, ఎస్‌ఐ చంద్రకుమార్, జూలపల్లి ఎస్‌ఐ మల్లేశ్, పాఠశాల హెచ్‌ఎం కవిత పాల్గొన్నారు.