యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Apr 12 , 2026 | 12:05 AM
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగా న్ని అరికట్టేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్య తీసుకుం టుందని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ అన్నారు.
కళ్యాణ్‌నగర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగా న్ని అరికట్టేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్య తీసుకుం టుందని డీసీపీ భూక్యా రాంరెడ్డి నాయక్ అన్నారు. శని వారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గంజాయి, మత్తుపదార్థాలకు బానిసలైన యువతకు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఆయన ప్రారంభిం చారు. యువకులు గంజాయి సేవిస్తూ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుం టున్నారని, యువతలో పెరుగుతున్న మత్తుపదార్థాల వినియోగం సమాజానికి ప్రమాదకరమని, వ్యసనాల నుంచి బయ టపడటానికి చికిత్స కేంద్రాలు ఎంతో ఉప యోగపడతాయన్నారు. డ్రగ్ అడిక్షన్ ఇన్ టెక్షన్ కేర్ యూనిట్‌తో ఔషధ చికిత్స, పునరావాస సేవలు అందుబాటులో ఉం టాయన్నారు. డ్రగ్స్‌కు బానిసలైన వారు వినియోగించుకొని ఆరోగ్యకరమైన జీవి తాన్ని గడపాలని కోరారు. వారం రోజుల క్రితం వైద్య సిబ్బందికి డ్రగ్స్ అడిక్షన్‌పై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజే శారు. ఏసీపీ మడత రమేష్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్‌ఎంఓలు రూపాబాయ్, దండె రాజు, హెచ్‌ఓడీ అరుణ, సైక్రియాటిస్ట్ రవివర్శ పాల్గొన్నారు.