Share News

యువతకు ఉపాధి శిక్షణ కల్పించాలి

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:30 AM

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంప్లాయిమెంట్‌ టైన్రింగ్‌, ఇండస్ట్రీ, ఎంగేజ్‌మెంట్‌ అంశంపై వివిధ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

యువతకు ఉపాధి శిక్షణ కల్పించాలి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక యువతకు మెరుగైన ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎంప్లాయిమెంట్‌ టైన్రింగ్‌, ఇండస్ట్రీ, ఎంగేజ్‌మెంట్‌ అంశంపై వివిధ కంపెనీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఉపాధి ఉద్యోగాలు, అర్హతలు, శిక్షణ, జీతం శ్రేణి, ఆశించిన ఉద్యోగాల గురించి చర్చించారు. నిరుద్యోగులకు డేటా అనలిస్ట్‌ ప్లేస్‌మెంట్‌, శిక్షణ అందించాలన్నారు. టాస్క్‌ ఆధ్వర్యంలో శిక్షణ అందించాలని తెలిపారు. పదో తరగతి , ఇంటర్మీడియట్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులకు సైతం ఉపాధి కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని తెలిపారు. బాలికలు, మహిళల కోసం 30 రోజుల స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను రూపకల్పన చేయాలని ఆదేశించారు. నియామక డైరవ్‌ నిర్వహించే సాధ్యసాధ్యాలపై చర్చించారు. టాస్క్‌ సెంటర్‌ ద్వారా ట్రైనింగ్‌, ప్లేస్‌మెంట్‌ ప్రోగ్రాంపై పలు సూచనలు చేశారు. స్థానిక యువతకు వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌ ఉపాధి అవకాశాలు, సోలార్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు ఐటీ, ఉద్యోగ అవకాశాలు, బేసిక్‌ టు మోడరేట్‌ స్థాయి అవకాశాలపై సమీక్షించారు. అనంతరం టాస్క్‌సెంటర్‌లో శిక్షణ పొంది ఐసిఐసిఐ బ్యాంక్‌లో సీనియర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌లో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌గా ఉద్యోగం సాధించిన ముస్త్యాల మణిశ్రీని కలెక్టర్‌ అభినందించారు. జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్‌, రీజినల్‌ టాస్క్‌ సెంటర్‌ ఇంచార్జి కౌసల్య, వివిధ కంపెనీల ప్రతినిధులు శ్యామ్‌, హరిహర్‌, వంశీ, అర్జున్‌, పాల్గొన్నారు.

విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను పెంచాలి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఎక్స్‌ఎల్‌ ఏఐతో విద్యార్థుల్లో మెరుగైన అభ్యసన సామర్థ్యాలను సాధించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏఎక్సెల్‌ ఏఐ అమలుపై ప్రధానోపాధ్యాయులు, అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, గత సంవత్సరం ఈ కార్యక్రమం అమలు చేసిన పాఠశాలల్లో విద్యార్థులు యాప్‌లో గడిపిన సగటు సమయం తక్కువగా ఉన్నట్లు గుర్తించామని, విద్యార్థుల ద్వారా క్రమం తప్పకుండా అభ్యసించేలా పాఠశాల స్థాయిలో ప్రత్యేక టైమ్‌టేబుల్‌ రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. గత సంవత్సరం ఏఎక్స్‌ఎల్‌ ఏఐ కార్యక్రమం అమలు చేసిన పాఠశాలల పనితీరును సమీక్షించిన అనంతరం, ఈ విద్యా సంవత్సరంలో మరో 37 పాఠశాలలకు ఈ కార్యక్రమాన్ని విస్తరించామని, ప్రస్తుతం జిల్లాలో 58 పాఠశాలల్లో కార్యక్రమం అమలవుతుందన్నారు. కేవలం యాప్‌ వినియోగానికి పరిమితం చేయకుండా, విద్యార్థుల నిజమైన అభ్యసన ఫలితాల మెరుగుదలకు ఉపయోగపడేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా విద్యాశాఖ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పిఎం షేక్‌, డిఆర్పిఎస్‌, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:30 AM