Share News

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలి

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:17 AM

ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైతే విద్యార్థులు విజయం సాధిస్తారని డీసీపీ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్‌ హైస్కూల్లో గురువారం పోలీసులు మీకోసం కార్యక్ర మంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరుకావాలి

ఓదెల, మార్చి 12(ఆంధ్రజ్యోతి) : ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైతే విద్యార్థులు విజయం సాధిస్తారని డీసీపీ రాంరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మోడల్‌ హైస్కూల్లో గురువారం పోలీసులు మీకోసం కార్యక్ర మంలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గర పడే కొద్ది విద్యార్థుల్లో ఆందోళన సహజమని, ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి పదో తరగతిలో జిల్లా, మండల స్థాయి గ్రేడ్‌ను సాధించి ముందుకు సాగాలని సూచించారు. మహోన్నతులను ఆదర్శంగా తీసుకొని ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసు కోవాలని కోరారు. రాబోయే పదోతరగతి వార్షికపరీక్షల్లో మంచి మార్కు లతో ఉత్తీర్ణత సాధించాలని, గురువులకు, తల్లిదండ్రులకు పుట్టి పెరిగిన గ్రామానికి పేరు, ప్రఖ్యాతులను తీసుకురావాలని కోరారు. విద్యార్థులు చిన్నవిషయాలకు ఆవేదనకు గురికాకూడదని, భవి ష్యత్తు ఆలోచనతో చదువుకోవాలని డీసీపీ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత డ్రగ్స్‌, సైబర్‌ నేరాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏసీపి కృష్ణ, సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ రమేష్‌ పరీక్ష ప్యాడ్లు, కంపాస్‌ బాక్స్‌, పెన్నుల తో పాటు సామగ్రిని పంపిణీ చేశారు. పొత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్‌, ఎంఈఓ రమేష్‌, మోటివేషన్‌ స్పీకర్‌ నరసింహా మూర్తి, మోడల్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, హెచ్‌ఎంలు పద్మ, సాంబయ్య, ఏసుదాస్‌, రమేష్‌, జ్యోతి, ఉపాధ్యాయులతోపాటు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:17 AM