పారఖ్ పరీక్షకు పకడ్బందీగా సిద్ధం కావాలి
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:41 AM
పారఖ్ పరీక్షను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని జిల్లా అకాడ మిక్ మానిటరింగ్ కో-ఆర్డినేటర్ ఎండీ షేక్ అంజద్ ఉపాధ్యాయులకు సూచించారు.
మంథని, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పారఖ్ పరీక్షను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని జిల్లా అకాడ మిక్ మానిటరింగ్ కో-ఆర్డినేటర్ ఎండీ షేక్ అంజద్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ప్రాథమిక పాఠశాలల సముదాయ సమావే శానికి హాజరైన ఆయన 2027లో నిర్వహించనున్న పారఖ్ పరీక్షకు సం బంధించిన అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులలో అభ్య సన సామర్థ్యాలను పెంపొందించేందుకు బోధనలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ రెమిడీయేషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహించే విద్యా సర్వేలో జిల్లా టాప్-50లో నిలిచేలా ఉపాధ్యా యులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ఉదాహరణలతో బోధించాలన్నారు. హెచ్‌ఎంలు పాల్గొన్నారు.