ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరి
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:08 AM
ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరిగా మారిందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎకో పార్క్ రోడ్డులోని ఆరోగ్యపథ్ వద్ద ఆరోగ్య మేళాను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ ప్రారంభించగా, డీఎంఎస్ అధ్యక్షులు రాఖీ సామంత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
జ్యోతినగర్, ఫిబ్రవరి8(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యకరమైన జీవితానికి యోగా తప్పనిసరిగా మారిందని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. ఆదివారం రామగుండం ఎన్టీపీసీలో నిర్వహించిన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, కుటుంబ సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఎకో పార్క్ రోడ్డులోని ఆరోగ్యపథ్ వద్ద ఆరోగ్య మేళాను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ ప్రారంభించగా, డీఎంఎస్ అధ్యక్షులు రాఖీ సామంత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ మేళాలో ఎన్టీపీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహాంగా పాల్గొన్నారు. యోగా, జుంబా సెషన్లు, పిట్‌నెస్ ఆటలు, ఆరోగ్య సంబంధిత స్టాళ్లు, వీధి నాటకం, సంగీత కార్యక్రమాలు, పిల్లలకు పోస్టర్ ప్రదర్శనతోపాటు పలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మేళా విజయవంతం కావడంపై నిర్వాహకులు అభినందనలు తెలిపారు.