కుల దూషణపై రాస్తారోకో
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:38 PM
పుట్టపాక సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఆయన కుటుంబ సభ్యులపై నగరంపల్లి ఉపసర్పంచ్ పోరెడ్డి తిరుపతిరెడ్డి కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మంథని-పెద్దపల్లి ప్రధా న రహదారిపై దళితులు సోమవారం రాస్తారోకోకు దిగారు.
మంథని, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): పుట్టపాక సర్పంచ్ కన్నూరి రాజబాబు, ఆయన కుటుంబ సభ్యులపై నగరంపల్లి ఉపసర్పంచ్ పోరెడ్డి తిరుపతిరెడ్డి కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మంథని-పెద్దపల్లి ప్రధా న రహదారిపై దళితులు సోమవారం రాస్తారోకోకు దిగారు. మాదిగ యువశక్తి ఫౌండర్ చైర్మన్ ఆసంపల్లి శ్రీనివాస్, అడ్వకేట్ బూడిద మల్లేష్‌లు మాట్లాడుతూ పుట్టపాకకు చెందిన కన్నూరి అభిరామ్, విద్యాధర్ ఆదివారం సాయంత్రం మంథని నుంచి బైక్‌పై వస్తున్న క్రమంలో పోరెడ్డి తిరుపతి రెడ్డి, వీరారెడ్డి, కన్నూరి తిరుపతి కారులో వస్తూ వారిని ఢీకొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ విషయమై సర్పంచ్ బంధువు కన్నూరి తిరుపతికి ఫోన్ చేసి బైక్‌ను ఢీకొట్టేందుకు ఎందుకు ప్రయత్నించారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో పోరెడ్డి తిరుపతిరెడ్డి ఫోన్ లాక్కుని కులం పేరుతో దూషించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రెడ్డి పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆందోళన వద్దకు చేరుకొని సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటా మని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెద్దెల్లి ప్రకాష్, అడ్వకేట్స్ అసంపల్లి రవి, ఇరుగురాల సంతోష్, గడ్డం సునీల్ కుమార్, బూడిద రాజన్నలు పాల్గొన్నారు.