Share News

వేసవి దృష్ట్యా పని వేళలు మార్చాలి

ABN , Publish Date - May 04 , 2026 | 12:07 AM

పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా పని వేళలు మార్చాలని ఆదివారం సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఓసీపీ-3 మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్‌ ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ కుంట ప్రవీణ్‌ మాట్లాడారు.

వేసవి దృష్ట్యా పని వేళలు మార్చాలి

యైుటింక్లయిన్‌కాలనీ, మే 3(ఆంధ్రజ్యోతి): పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా పని వేళలు మార్చాలని ఆదివారం సింగరేణి కాలరీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఓసీపీ-3 మేనేజర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్‌ ఆర్జీ-2 బ్రాంచి సెక్రెటరీ కుంట ప్రవీణ్‌ మాట్లాడారు. వేసవిలో సాధారణంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ఓసీపీలో దాదాపు 48 వరకు నమోదు అవుతున్నట్టు తెలిపారు. కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పనివేళల్లో మార్పులు చేయాలని ప్రవీణ్‌ డిమాండ్‌ చేశారు. తీవ్రమైన ఎండలతో డ్యూటీలకు రావాలంటేనే కార్మికులు జంకుతున్నట్టు తెలిపారు. 100 టన్నుల పార్కింగ్‌ యార్డుతో పాటు సర్వీస్‌ ఫీడర్‌ వద్ద ఏసీతో కూడిన రెస్ట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎండతో క్వారీ రోడ్లు దుమ్ము రావడంతో వేడి అధికంగా ఉంటుందని తెలిపారు. మొదటి, రెండో షిఫ్టు ప్రారంభానికి ముందే వాటర్‌ ట్యాంకర్లతో నీటిని చల్లించాలని కోరారు. సీహెచ్‌పీ కార్మికులకు కూల్‌ వాటర్‌ బాటిల్స్‌ ఇవ్వాలని, క్యాంటీన్‌లో అదనంగా ఫ్రిజ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. మొగిలి, వినేష్‌, శివకుమార్‌, రాజేందర్‌, సంతోష్‌, తిరుపతితో పాటు కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 12:07 AM